Movie Name: Run Raja Run (2014)
Lyrics Writer: Sri Mani
Singers : Chinmayi, Sripada
Lyrics in Telugu:
వద్దంటూనే నిన్ను వద్దంటూనే
వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా
కాదంటూనే నిన్ను కాదంటూనే
ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చావురా
ఉన్న మాటిది నిజమున్న మాటిది
అన్న మాటిది మనసన్న మాటిది
ప్రేమగా నిను చేరగా
ఆరాట పడుతుంది
నాలోనే ఉన్న తెలియలేదు
ఏ సడి లేని అలజడి
గుండెల్లో నిండి నిండి
ఉప్పొంగి పొంగి పొంగి
నీవైపు పరుగులు తీసిందిలా
ఓ మాట నను అడగలేదు
అదుపు లేని మనసిది
నువ్వంటే నచ్చి నచ్చి
ఎంతెంతో ఇష్టం వచ్చి
నీ చెంత చేరుకుంది ఈ రోజిలా
చుస్తూ చుస్తూనే
నేను నీ సొంతమైనా
గుర్తించలేదె కన్ను యే కొంచెమైన
వెన్నెల్లో నేనే నేను
నిన్నిలా ప్రేమిస్తున్నా
నీ మాయ దయ వలన
I’m in love baby, I’m in love baby
I’m in love baby, I’m in love
I’m in love baby, I’m in love baby
I’m in love baby, I’m in love
నీ పేరు పలికే పెదవి నేడు
పులకరింతల పువ్వయింది
నీలో అదేదో ఉంది నన్నేదో చేసేసింది
నా చుట్టు లోకమిలా నీలా కనిపిస్తుంది
నీ జంట నదిచే అదుగు చూడు
గాల్లోనా తేలే గువ్వయింది
నువ్వంటే తెలిసే కొద్ది
నీలో నిను కలిసే కొద్ది
నిన్నింక ప్రేమించాలని అనిపిస్తుంది
నీ నీడలోనే నాకు ఆనందం ఉంది
నూరేల్లకు నేను నీలోన బంది
యె ఒక్క క్షణం నీ తోడు వీడక
నీలోన సగమవనా
వద్దంటూనే నిన్ను వద్దంటూనే
వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా
కాదంటూనే నిన్ను కాదంటూనే
ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చావురా
ఉన్న మాటిది నిజమున్న మాటిది
అన్న మాటిది మనసన్న మాటిది
ప్రేమగా నిను చేరగా
ఆరాట పడుతుంది
No comments:
Post a Comment